News March 18, 2025
NTR: ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అటవీ శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు.
Similar News
News November 28, 2025
వనపర్తి: నామినేషన్లలో పొరపాట్లు వద్దు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎన్నికల నిబంధనలను జాగ్రత్తగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రెండో, మూడో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


