News March 18, 2025

NTR: ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలపై ప్ర‌త్యేక దృష్టి: కలెక్టర్ 

image

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీకి అధికారులు ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో అట‌వీ శాఖ స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీ, హ‌రిత విస్తీర్ణం పెంపు, ఆక్ర‌మ‌ణ‌ల నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు.

Similar News

News April 24, 2025

ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకుంటాం: హైడ్రా

image

HYDలో చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ పనిలో ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. ఫిర్యాదులతో పాటు సూచనలు అందించడానికి సైతం హైడ్రా కార్యాలయానికి ప్రజలు రావచ్చని పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు.

News April 24, 2025

HYD: సిల్ట్ తొలగింపునకు రోబోటిక్ టెక్నాలజీ..!

image

HYDలో HYDలో పైపుల్లో మురుగు సిల్ట్ తొలగించడం కోసం ఇక రోబోటిక్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద సచివాలయం సమీపంలో ‘సేవర్ క్రోక్’ రోబోటిక్ యంత్రం పనితీరును హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కలిసి పరిశీలించారు. వాటర్ జెట్ శక్తితో బ్లేడ్లు తిరుగుతూ ఈ యంత్రం సిల్ట్ తొలగిస్తుంది. ఇది నగరవ్యాప్తంగా అమలు చేస్తే ఇక డ్రైనేజీ పొంగి పొర్లే సమస్య తీరనుంది.

News April 24, 2025

నల్గొండ జిల్లాలో సుర్రుమంటున్న ‘సూరన్న’

image

నల్గొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అనే నాణుడిని నిజం చేస్తూ రోహిణీకి ముందే సూరన్న సుర్రుమంటున్నాడు. బుధవారం కట్టంగూర్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడ్గులపల్లి 45.2, నిమనూరు 44.9, త్రిపురారం 44.8, నార్కట్‌పల్లి 44.6, అనుముల 44.6, వేములపల్లి 44.6, దామరిచర్ల 44.4, తిప్పర్తిలో కనిష్ఠంగా 44.1 డిగ్రీలు నమోదయ్యాయి.

error: Content is protected !!