News January 10, 2026
NTR: ఆవకాయ ఫెస్టివల్‌పై అలిగిన కూటమి నేతలు!

‘అమరావతి-ఆవకాయ ఫెస్టివల్’ అధికారుల సమన్వయ లోపంతో వెలవెలబోతోంది. కార్యక్రమ నిర్వహణపై జిల్లా MLAలు, కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫెస్టివల్ ఏర్పాట్లపై జరిగిన సమావేశాల్లో ఒక్కదానికి కూడా తమను ఆహ్వానించలేదని నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తొలిరోజు CM చంద్రబాబు వస్తున్నారని డ్వాక్రా మహిళలను తరలించినా, ఆయన ప్రసంగం ప్రారంభం కాకముందే వారు నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News January 24, 2026
నెల్లూరు: బాల్యవివాహాల.. ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

పొదలకూరు మండలం మొగళ్లూరు అంగన్‌వాడీ కేంద్రంలో ECCE డే సందర్భంగా బాల్యవివాహాల నివారణపై ఐసీడీఎస్ సీడీపీవో వి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.18 ఏళ్లు నిండకముందే ఎక్కడైనా పెళ్లిలు జరుగుతుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1098కి కాల్ చేయాలని తెలిపారు.
News January 24, 2026
సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జీల నియామకం

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్‌ఛార్జీలను బీఆర్ఎస్ అధిష్ఠానం శనివారం నియమించింది. గజ్వేల్‌కు రాధాకృష్ణ శర్మ, దుబ్బాకకు గుండు భూపేష్, హుస్నాబాద్‌కు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, చేర్యాలకు ఎల్లు రవిందర్ రెడ్డిను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ, అభ్యర్థుల ఎంపికలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
News January 24, 2026
HYD: రేపు లుంబినీ పార్కు వద్ద సందడి!

హైదరాబాద్ గగనతలం దేశభక్తి గీతాలతో ప్రతిధ్వనించనుంది. గణతంత్ర వేడుకలు, వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టిలరీ సెంటర్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు లుంబినీ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద భారీ ‘మిలిటరీ బ్యాండ్’ ప్రదర్శన జరగనుంది. సైనికుల క్రమశిక్షణ, సంగీత విన్యాసాల కలబోతగా సాగే ఈ వేడుక నగరవాసులకు కనువిందు చేయనుంది.


