News April 12, 2025

NTR: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో గంపలగూడెంలోని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని అపరంజి ఉత్తమ మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కి 452 మార్కులతో గంపలగూడెం మండలంలోని ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానంలో నిలిచింది. అపరంజి ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. 

Similar News

News January 20, 2026

కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డిపై కంప్లైంట్

image

ఖమ్మం సభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. సోమవారం ఎస్పీ రోహిత్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. ‘బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతున పాతాలి, గ్రామాల్లో పార్టీ దిమ్మెలను కూల్చాలి’ అంటూ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

News January 20, 2026

‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

image

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.

News January 20, 2026

MHBD: వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ

image

జిల్లావ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యేలు, అధికారులు పలు మండలాల్లో పాల్గొన్నారు. డోర్నకల్, MHBD, తొర్రూర్ మండలాలలో ఆయా ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, మురళి నాయక్, యశస్విని రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 947 ఎన్ఎస్‌జీ బృందాలకు రూ.3,28,26,274 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.