News February 12, 2026

NTR: ఎమ్మెల్యే కొలికపూడికి హెచ్చరిక

image

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అసెంబ్లీ లాబీలో భేటీ అయ్యారు. పార్టీ క్రమశిక్షణపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తన అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరిగాయని కొలికిపూడి వివరణ ఇచ్చి, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కోరినట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

image

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.

News March 13, 2026

ఆసిఫాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ కొరత లేదు: కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో గృహ అవసరాల LPG సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ హరిత తెలిపారు. గ్యాస్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, నిల్వలను ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.

News March 13, 2026

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి క్లిష్టమైన శస్త్ర చికిత్సలకు కేంద్రంగా మారిందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం 51 సంవత్సరాల మహిళకు మూత్రశయంలోని 3 గడ్డలు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు మహిళలకు ఆర్థోస్కోపిక్ విధానంలో కుడి భుజానికి, ఎడమ మోకాలికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. సర్జరీలో పాల్గొన్న వైద్యబృందాన్ని అభినందించారు.