News March 5, 2025
NTR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య ఇదే

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26,679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్‌లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.
Similar News
News March 3, 2026
మత్తు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడి

TG: ఓ యువతికి యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బాచుపల్లి(Hyd)లోని బీటెక్ కాలేజీలో జరిగింది. పోలీసుల ప్రకారం.. తనయ్ అనే స్టూడెంట్ అదే కాలేజీలో చదివే యువతికి మాయమాటలు చెప్పి మత్తు చాక్లెట్లు ఇచ్చి క్లాసులోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. అతని స్నేహితుడూ వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేయగా ఇంట్లోవాళ్లకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.
News March 3, 2026
NGKL: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వనపర్తి జిల్లాలో సెంట్రింగ్ పనులు ముగించుకుని బైక్‌పై వస్తుండగా చిట్యాల వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మహాదేవునిపేట వాసులు హేమంత్(19), శ్రీకాంత్, విజయేందర్‌లు పని ముగించుకుని వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని MBNR ఆసుపత్రికి తరలిస్తుండగా.. హేమంత్ మార్గంమధ్యలో మృతిచెందారు.
News March 3, 2026
మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.


