News February 26, 2025
NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.
Similar News
News March 2, 2026
B2 బాంబర్ గర్జన: 37 గంటల జర్నీ.. 900 స్ట్రైక్స్!

USకు చెందిన B2 Spirit Stealth Bombers ఇరాన్‌లోని అండర్‌గ్రౌండ్ బాలిస్టిక్ మిస్సైల్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. బ్రిటన్ మొదట తన బేస్‌లను వాడుకోనివ్వకపోవడంతో USలోని మిస్సోరి నుంచి బయలుదేరి ఏకధాటిగా 37 గంటల పాటు ప్రయాణించి దాదాపు 900 దాడులు చేసినట్లు సమాచారం. గాలిలోనే ఇంధనం నింపుకొంటూ వెళ్లిన ఈ స్టెల్త్ విమానాలు GBU-31 గైడెడ్ బాంబులతో ఇరాన్ రక్షణ వ్యవస్థకు అందకుండా మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేశాయి.
News March 2, 2026
నిర్మల్: వరి సాగు చేస్తున్నారా..? ఈ పద్ధతి పాటించండి

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 1.21 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పంట అధిక దిగుబడి రావాలంటే సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి కుమార్ రైతులకు సూచిస్తున్నారు. చీడపీడల నుంచి రక్షణ పొందాలంటే పంటలో కాలిబాటలు చేసుకోవాలని తెలుపుతున్నారు. దీనివల్ల గాలి, సూర్యరష్మితో పాటు పంటకు ఎరువులు, మందులు పిచికారీ చేయడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు.
News March 2, 2026
రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.


