News January 10, 2026

NTR: కిడ్నీ బాధితులకు అండగా ఎంపీ చిన్ని

image

తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం పరిధిలోని కిడ్నీ బాధితులకు విజయవాడ ఎంపీ చిన్ని తన సొంత నిధులు రూ. 6-7లక్షలు వెచ్చించి సుమారు వెయ్యి మందికి పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేస్తున్నారు. కిట్లలో జొన్నపిండి, నువ్వులు, అటుకులు, చిక్కీ ఇతర ఆహార పదార్థలు ఉన్నాయి. మరో 10 రోజుల్లో CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధిత 52 గ్రామాలకు కృష్ణా నది నీటి పంపిణీ ప్రారంభించినున్నారు.

Similar News

News January 20, 2026

పోలవరం: అయ్యో.. ఈ పాపం ఎవరిది?

image

పోలవరం జిల్లా చింతూరు మండలంలో సోమవారం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులు ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను కల్లేరు పంచాయతీ మధుగురు శివారున పొదల్లో పడేశారు. అటుగా వెళ్తున్న ఇద్దరు మహిళలకు కేకలు వినబడడంతో వెళ్లి చూడగా.. పొదల్లో ఆడ శిశువు ఉంది. వెంటనే ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.

News January 20, 2026

సంగారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి దామోదర్ పర్యటన

image

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారని అధికారులు, పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

News January 20, 2026

ఈ మాసంలో ‘ప్రతిరోజు పర్వదినమే’

image

ఆధ్యాత్మికపరంగా మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతిరోజును పర్వదినంగానే భావిస్తారు. సూర్యుడు, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి, రథసప్తమి, మహా శివరాత్రి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు మాఘ మాసం ఎంతో అనువైనది. పెళ్లిళ్లు ఎక్కువగా మాఘ మాసంలోనే ఎందుకు జరుపుతారో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.