News February 18, 2025
NTR: గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

మైలవరం, జగ్గయ్యపేటలోని జ్యోతిబాఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాదిలో 5వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశపరీక్ష నిర్వహించి మైలవరంలో 80, జగ్గయ్యపేటలో 40 సీట్లు భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 15 లోపు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు సూచించారు.
Similar News
News March 19, 2025
సిద్దిపేట: ముగ్గురు ఎంపీడీవోలకు పదోన్నతి

సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తున్న ఏ. ప్రవీణ్, జయరాం, ఏపీడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌లకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు వెలువరించారు.
News March 19, 2025
సన్న వడ్లకు రూ.500 బోనస్‌పై UPDATE

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
News March 19, 2025
పెద్దేముల్ మండలంలో తెల్లవారుజామున హత్య

పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.