News February 24, 2025
NTR: జిల్లాలో జరిగిన చారిత్రక ఘట్టంపై గ్రూప్-2 పరీక్షలో ప్రశ్న

ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలోని 1వ పేపర్లో విజయవాడలో జరిగిన చారిత్రక ఘట్టంపై APPSC అభ్యర్థులను ప్రశ్న అడిగింది. విజయవాడలో “నెడుంబ వసతి” అనే జైన ఆలయాన్ని నిర్మించిన మహిళ అయ్యన మహాదేవి కాగా ఆమె ఎవరి పట్టమహిషి అనే ప్రశ్నను APPSC అభ్యర్థులను అడిగింది. కాగా సాయంత్రం వెలువడిన ప్రాథమిక కీలో ఈ ప్రశ్నకు సమాధానం “కుబ్జ విష్ణువర్ధునుడిగా” APPSC ప్రకటించింది.
Similar News
News November 19, 2025
హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టు!

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా నిన్న ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడం తెలిసిందే. అయితే ఆయన అనుచరుడు మద్వి సరోజ్ కోనసీమ(D) రావులపాలెంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు అరెస్టు చేశారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారని సమాచారం. కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చాడు? ఎప్పటినుంచి ఉంటున్నాడు? తదితరాలపై ఆరా తీస్తున్నారు.
News November 19, 2025
ఈ ఏడాది 328 రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: సీపీ

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ వరకు వ్యక్తుల మరణాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు 328 జరిగాయని పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 92 ప్రమాదాలు తక్కువగా జరిగాయని ఆయన వివరించారు. నందిగామలోని అనాసాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో కమిషనర్ ఈ వివరాలను వెల్లడించారు.
News November 19, 2025
చింతూరు: ఆడుతూ స్పృహ తప్పి చిన్నారి మృతి

చింతూరు మండలం కుయుగూరులో చిన్నారి శ్యామల జనని(5) బుధవారం ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. బాలిక తోటి పిల్లలతో అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ దారిలో ఉన్న రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.


