News February 24, 2025

NTR: జిల్లాలో జరిగిన చారిత్రక ఘట్టంపై గ్రూప్-2 పరీక్షలో ప్రశ్న

image

ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలోని 1వ పేపర్‌లో విజయవాడలో జరిగిన చారిత్రక ఘట్టంపై APPSC అభ్యర్థులను ప్రశ్న అడిగింది. విజయవాడలో “నెడుంబ వసతి” అనే జైన ఆలయాన్ని నిర్మించిన మహిళ అయ్యన మహాదేవి కాగా ఆమె ఎవరి పట్టమహిషి అనే ప్రశ్నను APPSC అభ్యర్థులను అడిగింది. కాగా సాయంత్రం వెలువడిన ప్రాథమిక కీలో ఈ ప్రశ్నకు సమాధానం “కుబ్జ విష్ణువర్ధునుడిగా” APPSC ప్రకటించింది.

Similar News

News March 22, 2025

గద్వాల: ఈ ఫొటోకు ఐదేళ్లు..!

image

కరోనా కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో నేటికి జనతా కర్ఫ్యూ విధించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా చాలావరకు సోషల్ మీడియా ద్వారా జనతా కర్ఫ్యూ పేరిట పోస్టులు చేసుకుంటున్నారు. నాటి గద్వాల కర్ఫ్యూపై తీసిన ఫొటో ఐదేళ్లు పూర్తి చేసుకుందని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 

News March 22, 2025

GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News March 22, 2025

డీలిమిటేషన్ అమలైతే మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు: CM రేవంత్

image

TG: డీలిమిటేషన్ విషయంలో BJPని అడ్డుకోవాలని CM రేవంత్ అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ‘జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తున్నారు. రూపాయి పన్ను కట్టే తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి రూ. ఆరు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!