News August 16, 2024

NTR జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ

image

NTR జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఎస్ఐలను భారీగా బదిలీ చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 100 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్‌లో ఉన్నా ఎస్ఐలకు స్థానచలనం కల్పించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.

Similar News

News December 29, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News December 28, 2025

కోడూరు పంట కాలువలో మృతదేహం కలకలం

image

కోడూరు-అవనిగడ్డ ప్రధాన పంట కాలువలో సుమారు 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. ఆదివారం మాచవరం గ్రామం వద్ద కాలువలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే కోడూరు లేదా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు.