News February 23, 2025
NTR జిల్లా TODAY TOP NEWS

* విజయవాడలో సొంత చెల్లినే గర్భవతిని చేసిన <<15550937>>అన్న<<>>
* NTR జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
* ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
* విజయవాడలో 372 ఫోన్లు <<15553167>>రికవరీ<<>>
* విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత
* ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించిన మంత్రులు
* రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి: VJA ఏసీపీ
Similar News
News February 24, 2025
HYD: దాయాదుల మ్యాచ్.. భారీగా పందేలు

నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.
News February 24, 2025
BREAKING: మహబూబ్‌నగర్: ప్రైవేట్ బస్సు దగ్ధం

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వెనుక టైరు పగిలి మంటలు అంటున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశారు. కాగా, బస్సులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు దగ్ధం అయింది.
News February 24, 2025
కనగల్: చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.