News April 9, 2025
NTR: జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన తాడిగడప సీఐడీ కార్యాలయానికి ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సంబంధించి అవసరమైన ఆధారాలను కూడా తీసుకురావాలని ఆదేశించింది.
Similar News
News December 8, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: ఎస్పీ

అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు సమస్యలపై 36 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా ఎస్పీకి సమస్యలు అందజేశారు. వాటిపై ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.
News December 8, 2025
బాపట్ల: అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అర్జీలను అందజేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.


