News February 24, 2025
NTR టూడే టాప్ న్యూస్

*విజయవాడలో వ్యభిచార గృహం పై పోలీసుల దాడి *పెనమలూరులో నడిరోడ్డులో వృద్ధుడిపై యువకులు దాడి *అసెంబ్లీ నుంచి వచ్చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు*విజయవాడ: కస్టడీకి వల్లభనేని వంశీ * వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు: పవన్ కళ్యాణ్*మైలవరంలో దళిత సంఘాల ఆందోళన*కంకిపాడులో విజయవాడ యువకులు అరెస్ట్ *మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య *వంశీకి మంచం సౌకర్యం కల్పించాలి
Similar News
News March 23, 2025
సంగారెడ్డి: నేటితో ముగియనున్న గడువు: డీఈవో

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారు నిర్వహిస్తున్న యువికాలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుందని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇస్రో వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.
News March 23, 2025
RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

IPL2025 తొలి మ్యాచులో KKRపై విజయం సాధించిన RCBకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా X వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఎట్టకేలకు ఆర్సీబీ బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన మాల్యా ప్రస్తుతం UKలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
News March 23, 2025
కౌటాలలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ

కౌటాలలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో టోర్నీ ఉంటుందని, ఒక గ్రామం నుంచి ఒకే టీమ్‌కు అవకాశం ఉందన్నారు. వివరాలకు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.