News April 14, 2025

NTR: నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు- కలెక్టర్

image

సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉన్న నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కార (PGRS) వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశారు. విజయవాడలోని కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మిశ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లా పరిధిలోని అర్జీదారులు గమనించాలని కోరింది.

Similar News

News April 16, 2026

44.1 డిగ్రీలతో సెగలు గక్కుతున్న నల్గొండ

image

నల్గొండ జిల్లాలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. భానుడి భగభగలకు జిల్లా నిప్పుల కొలిమిలా మారగా, గుడిపల్లిలో అత్యధికంగా 44.1°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకొండ, కట్టంగూరు వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News April 16, 2026

పెద్దల సభపై యనమల కన్ను.. అధినేత కరుణించేనా?

image

రాజ్యసభకు వెళ్లాలన్న తన మనసులో మాటను టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో ఒకటైనా దక్కుతుందని ఆయన ఆశిస్తున్నారు. అయితే, సానా సతీశ్ పదవీకాలాన్ని పొడిగిస్తారన్న ప్రచారంతో యనమల అభ్యర్థిత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకున్న ఆయనకు చంద్రబాబు పెద్దల సభ అవకాశం ఇస్తారో లేదోనని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

News April 16, 2026

NLG: రైతు భరోసాపై వీడని సందిగ్ధం

image

రైతు భరోసా రెండో విడత నిధుల జమపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 13 నుంచే నిధులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో మొదటి విడతగా ఎకరంన్నర లోపు భూమి ఉన్న రైతులకు రూ.268.57 కోట్లు జమ చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.