News March 11, 2025
NTR : పరిష్కార వేదికలో 135 ఫిర్యాదులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించామని ఏబీటీఎస్.ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు 30, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు 25, మహిళా సంబంధిత నేరాలకు 18, భూవివాదాలకు 22, వివిధ మోసాలకు 13, దొంగతనాలకు 03, కొట్లాటకు 06, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, ఘటనలకు 18, మొత్తం 135 ఫిర్యాదులను స్వీకరించామన్నారు.
Similar News
News November 25, 2025
తిరుపతిలోని కాలేజీలకు నేడు సెలవు

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికాసేపట్లో పంచమితీర్థం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU)కి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పంచమి తీర్థం సందర్భంగా లోకల్ హాలిడే ఇచ్చామని.. తిరుపతి సిటీలోని అన్ని డిగ్రీ కళాశాలలకు సెలవు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
News November 25, 2025
మళ్లీ ప్రకాశంలోకి అద్దంకి నియోజకవర్గం?

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోని కలవనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి పరిపాలన దృష్ట్యా బాపట్లలో చేర్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా అద్దంకిని ప్రకాశంలో కలిపి, రెవెన్యూ డివిజన్గా మార్చేందకు ఉపసంఘం ప్రతిపాదించింది. నిన్న అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం
News November 25, 2025
EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.


