News March 11, 2025

NTR : పరిష్కార వేదికలో 135 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించామని ఏబీటీఎస్.ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు 30, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు 25, మహిళా సంబంధిత నేరాలకు 18, భూవివాదాలకు 22, వివిధ మోసాలకు 13, దొంగతనాలకు 03, కొట్లాటకు 06, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, ఘటనలకు 18, మొత్తం 135 ఫిర్యాదులను స్వీకరించామన్నారు.

Similar News

News January 20, 2026

కామారెడ్డి: పదో తరగతి విద్యార్థినులకు ఇస్రో సందర్శన భాగ్యం

image

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థినులు, వారితో పాటు 30 మంది ఉపాధ్యాయులు ఈనెల 29 ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.

News January 20, 2026

NZB: CM దావోస్ ట్రిప్ దండగ.. Xలో కల్వకుంట్ల కవిత

image

CM రేవంత్ రెడ్డి ట్రిప్ దండగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత Xలో విమర్శించారు. ఎక్కే విమానం – దిగే విమానం .. రూ. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి అని ప్రశ్నించారు. దావోస్ సమ్మిట్‌లు, TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చేసుకున్న MOUలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

News January 20, 2026

కోటప్పకొండకు రానున్న డిప్యూటీ సీఎం పవన్: ఎమ్మెల్యే

image

కోటప్పకొండ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో నూతన రహదారుల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించగా, ఈ నెల 22న వస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.