News July 5, 2024

NTR: పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

image

NTRజిల్లా కంభంపాడుకి చెందిన శేషుకుమార్‌‌కి TG మహబూనగర్ జిల్లా శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)తో 2014లో పెళ్లయింది. 10ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఇద్దరూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపం చెందిన రాజశ్రీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ..బుధవారం రాత్రి మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News December 5, 2025

ఉయ్యూరు కేసీపీలో క్రషింగ్‌ షురూ

image

ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించిన చెరకు క్రషింగ్‌ను గురువారం రాత్రి యూనిట్‌ హెడ్‌ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్‌లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు టన్ను ధర రూ.3,690గా యాజమాన్యం నిర్ణయించింది.

కృష్ణా: గోనె సంచుల కొరతపై సీఎస్ అరా

image

ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో నెలకొన్న గోనె సంచుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అరా తీశారు. ధాన్యం సేకరణపై గురువారం ఆయన రాష్ట్ర సచివాలయాల నుంచి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లాలో కోటి గోనె సంచుల అవసరాన్ని గుర్తించగా ఇప్పటికే 50 లక్షలు రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గోనె సంచుల సరఫరాకు సహకరించాలని సీఎస్‌ను కోరారు.