News July 5, 2024
NTR: పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

NTRజిల్లా కంభంపాడుకి చెందిన శేషుకుమార్‌కి TG మహబూనగర్ జిల్లా శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)తో 2014లో పెళ్లయింది. 10ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఇద్దరూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపం చెందిన రాజశ్రీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ..బుధవారం రాత్రి మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 9, 2025
గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.
News December 8, 2025
మచిలీపట్నం: అనాథ పిల్లలకు అమృత ఆరోగ్య కార్డులు

మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాథ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి ఆరోగ్య భద్రతపై అవగాహన కూడా కల్పించారు.
News December 8, 2025
కృష్ణా జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.


