News March 14, 2025

NTR: ప్ర‌ణాళిక‌తో ధాన్యం సేక‌ర‌ణ‌కు సిద్ధంకండి- కలెక్టర్

image

జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి విజ‌య‌వంతంగా ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తయింద‌ని, ఇదే విధంగా ర‌బీ (2024-25) సీజ‌న్ ధాన్యం కొనుగోలుకు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. గురువారం పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ సౌర‌భ్ గౌర్‌, ర‌హిత డిజిట‌ల్ లావాదేవీలు త‌దిత‌రాల‌పై వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించి ఆయన మాట్లాడారు.

Similar News

News October 31, 2025

MBNR: U-17 రగ్బీ.. NOV 3న ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. మహబూబ్ నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌‌లో నవంబర్ 3న అండర్-17 విభాగంలో బాల, బాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తి గల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు.

News October 31, 2025

కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (1/2)

image

ఆంధ్రప్రదేశ్‌లో బొండానికి, టెంకాయకు మేలైన కొబ్బరి రకాలు.
☛ ఈస్ట్‌కోస్ట్ టాల్: ఇది దేశవాళి పొడవు రకం. నాటిన 6 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 80-100 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గౌతమి గంగ: ఇది పొట్టి రకం. నీటి బొండాలకు బాగా ఉపయోగపడుతుంది. నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 85-90 కాయల దిగుబడి వస్తుంది. కాయలో నూనె దిగుబడి 69 శాతం.

News October 31, 2025

కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (2/2)

image

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.