News April 16, 2025
NTR: బీ-ఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 8వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 21 నుంచి 28 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యూనివర్శిటీ పరిధిలోని 3 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
Similar News
News November 5, 2025
GNT: ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా సీసీఐకి విక్రయించాలి

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
News November 5, 2025
డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

ప్రసవం తర్వాత పొట్టను తగ్గించడానికి చాలామంది అబ్డామినల్ బెల్టును వాడతారు. అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది కానీ పొట్టను తగ్గించడంలో ఉపయోగపడదంటున్నారు నిపుణులు. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి అని చెబుతున్నారు. క్రంచెస్, స్ట్రెయిట్ లెగ్ రైజింగ్, ప్లాంక్స్ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.
News November 5, 2025
విశాఖ: కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందే

GVMC పరిధిలో తాగునీటి కనెక్షన్ల ఏర్పాటుకు సిబ్బంది అనధికారంగా కలెక్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనెక్షన్ పొందాలంటే కేవలం దరఖాస్తు పెడితేనే సరిపోదని, సంబంధిత అధికారి చేయి తడపాల్సివస్తోందంటున్నారు. గ్రూప్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలు ఇలా ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలు పెడుతూ తిప్పించుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


