News April 16, 2025

NTR: మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్

image

జిల్లాలో పీ-4 స‌ర్వే ఆధారంగా గుర్తించిన ప్ర‌తి కుటుంబానికి ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్నట్లు మంగళవారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. కుటుంబాల నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌డంలో జిల్లాస్థాయి అధికారులు క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో కలిసి స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో కలెక్టర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. 

Similar News

News April 24, 2025

MBNR: ‘భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి’

image

జిల్లాలో భూగర్భ జిల్లాలో అడుగంటకుండా వాటిని పెంచేందుకు వర్షపు నీటి సంరక్ష నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో నీటి నియంత్రణపై ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

News April 24, 2025

నిర్మల్: తల్లిదండ్రులను కోల్పోయిన ఆగని లక్ష్యం

image

ఖానాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల కళాశాల విద్యార్థిని తోకల ముత్తవ్వ అలియాస్ సుప్రియ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. BiPC ప్రథమ సంవత్సరంలో 429 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు లేకపోయినా పిన్ని, బాబాయిల సహకారంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివినట్లు తెలిపింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది. సరూర్నగర్లోని COEలో సీటు సాధించడంతో ప్రస్తుతం నీట్ శిక్షణ పొందుతోంది.

News April 24, 2025

సంగారెడ్డి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు: ఐజీ

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిన్నారంలో 19న కొన్ని కోతులు గుట్టపై శివుని విగ్రహం కింద పడేయడంతో ధ్వంసమైనట్లు విచారణ తేలిందన్నారు. 22న గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు వెళ్తున్న మదార్సా విద్యార్థులను చూసి కొందరు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. 

error: Content is protected !!