News March 11, 2025

NTR: రద్దైన పరీక్ష నిర్వహించేది ఎప్పుడంటే..!

image

పేపర్ లీకైన కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7న రద్దైన బీఈడీ- పర్స్‌పెక్టివ్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పేపర్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకైన కారణంగా మంత్రి లోకేశ్ ఆదేశాలతో ANU అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అటు లీకేజీకి కారణమైన నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News October 20, 2025

ఆకాశంలో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు

image

NTR (D) వీరులపాడు (M) రంగాపురం శివారులో ఆకాశంలో ఇంద్ర ధనస్సు కనువిందు చేసింది. గ్రామంలో సాధారణ నుంచి మోస్తరు చిరుజల్లులు ప్రారంభమయ్యాయని, ఆ సమయంలో ఏర్పడిన ఇంద్ర ధనస్సు చూపరులను ఆకట్టుకుందని స్థానికులు తెలిపారు. గ్రామానికి దగ్గరలోని అటవీ ప్రాంతం ఉండడంతో కొండ ప్రాంతం సైతం పచ్చటి వాతావరణం నెలకొందని స్థానికులు అన్నారు.

News October 20, 2025

మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

image

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.

News October 20, 2025

NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.