News March 12, 2025
NTR: రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తుంది- కలెక్టర్

సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం జీఓఆర్టీ నం.9విడుదల చేసిందన్నారు.
Similar News
News October 16, 2025
సంగారెడ్డి: ఎస్పీని కలిసిన బీసీ జేఏసీ నాయకులు

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్‌ను బీసీ జేఏసీ నాయకులు గురువారం కలిశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈనెల 18న జరిగే బంద్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్, గోకుల్ కృష్ణ, మల్లికార్జున్ పటేల్, వెంకట హరి హర కిషన్, మంగ గౌడ్, వీరమని, నాయకులు పాల్గొన్నారు.
News October 16, 2025
సెమీస్‌లో 3 బెర్తులు.. పోటీలో నాలుగు జట్లు!

WWC సెమీస్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ బంగ్లాపై విజయంతో AUS సెమీస్‌కు దూసుకెళ్లింది. మిగిలిన 3 స్థానాల కోసం ప్రధానంగా 4 జట్ల మధ్యే పోటీ ఉండనుంది. పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చివరి 3 స్థానాల్లో ఉన్న బంగ్లా(2), శ్రీలంక (2), పాక్(1) దాదాపు రేస్ నుంచి తప్పుకున్నట్లే. ENG(7), SA(6), IND(4), NZ(3) పోటీ పడనున్నాయి. పాయింట్స్‌తో పాటు రన్‌రేట్ కీలకం కానుంది. మీ ప్రిడిక్షన్ కామెంట్ చేయండి.
News October 16, 2025
నాగర్‌కర్నూల్: నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు తపాలా ద్వారా పంపిణీ

జిల్లాలో ఓటర్ల వివరాలను సక్రమంగా క్రమబద్ధీకరించేందుకు సమగ్ర చర్యలు చేపట్టబడుతున్నామని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ తెలిపారు. నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ సహకారంతో పంపిణీ చేసే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ప్రతి ఓటరికి వారి ఓటరు గుర్తింపు కార్డు సురక్షితంగా, సమయానికి అందేలా చూడగలమని తెలిపారు.