News March 12, 2025

NTR: రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తుంది- కలెక్టర్

image

సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకోలేని నిరుపేద‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సువ‌ర్ణావ‌కాశాన్ని క‌ల్పించింద‌ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పీఎం ఆవాస్ యోజ‌న 1.0 కింద గృహ నిర్మాణం చేప‌ట్టిన ల‌బ్ధిదారుల‌కు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అద‌నంగా వివిధ వ‌ర్గాల వారికి ప్ర‌యోజ‌నం క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం జీఓఆర్‌టీ నం.9విడుద‌ల చేసింద‌న్నారు.

Similar News

News February 8, 2026

KNR: ముగింపు దశకు పుర పోరు.. హోరెత్తుతున్న ప్రచారం!

image

ఉమ్మడి KNRజిల్లాలోని మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. సోమవారం సా.5గంటలకు ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర స్థాయి అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలు,ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా మారింది.

News February 8, 2026

NGKL: ఈ నెల 14 నుంచి బౌరాపూర్ జాతర

image

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని బౌరాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి జాతరకు ఫిబ్రవరి 14 తేదీ నుంచి మూడు రోజుల పాటు అనుమతి ఇస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఉంటుందన్నారు. భక్తులు అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు, మంట వస్తువులు, అధిక శబ్దాలు చేస్తూ అడవి జంతువులకు ఇబ్బంది కల్గించవద్దని సూచించారు.

News February 8, 2026

తిరుమలలో వివాహానికి నో ఫీజ్.!

image

తిరుమల శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ఆధ్వర్యంలో వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర పూజా కార్యక్రమాలు తక్కువ రుసుములతో నిర్వహిస్తున్నారు. వివాహం ఉచితం కాగా, ఇతర సేవలకు రూ.50 నుంచి రూ.300 వరకు ఫీజులు నిర్ణయించారు. భక్తులు కళ్యాణ వేదికలో సంప్రదించి సేవలు పొందవచ్చు.