News March 16, 2025

NTR: రేపటి నుంచే 10th ఎగ్జామ్స్ 

image

జిల్లాలో 10 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అరగంట ముందే అనుమతిస్తారని, మొబైల్ /ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. 

Similar News

News November 28, 2025

కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

image

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

News November 28, 2025

గంగాధర: రూపాయి బిళ్లలతో సర్పంచ్ నామినేషన్

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన జంగిలి మహేందర్ అనే యువకుడు వినూత్నంగా రూపాయి బిళ్లలతో నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. ఒక్క ఓటుతో ఓటమి చెందారు. దీంతో ఒక్క ఓటు విలువ తెలియడంతో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి రూపాయి బిళ్లలతో నామినేషన్ వేసినట్లు మహేందర్ చెప్పారు.

News November 28, 2025

MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.