News February 2, 2025
NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో LLM పీజీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ శనివారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News December 6, 2025
VKB: 3వ విడతలో 909 నామినేషన్లు

వికారాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో మొత్తం 157 జీపీలకు 909 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల కోసం 3,055 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిల్లో పరిగి నియోజకవర్గంలోని మండలాల్లోనే 1,340 వార్డు స్థానాలు ఉన్నాయి. కాగా ఈ విడతలో మొత్తం 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుకలెక్టర్ తెలిపారు.
News December 6, 2025
TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
News December 6, 2025
విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.


