News March 19, 2024
NTR: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గమనిక

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్లను ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ రద్దు చేస్తున్నట్లు, రైల్వే వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.
Similar News
News April 11, 2025
మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా రాజబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు.
News April 11, 2025
తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు.!

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం, మే 14 నుంచి 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు నడవనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్లు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సూచించింది.
News April 11, 2025
MTM: పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు

మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్చి నెల జరిగిన క్రైమ్ డిటెక్షన్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్స్ బాజీ, మూర్తిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు.