News February 5, 2025
NTR: సదస్సుల ద్వారా 96% అర్జీలు పరిష్కరణ- కలెక్టర్

రెవెన్యూ సదస్సుల ద్వారా 96% అర్జీలను పరిష్కరించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 3,111 పిటిషన్లు రాగా 3,015 అర్జీలు పరిష్కారం పూర్తయిందన్నారు. అర్జీ అందుకున్నప్పుడే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి తగిన సూచనలు తెలియజేస్తున్నామన్నారు.
Similar News
News October 24, 2025
కేయూలో స్పోర్ట్స్ టోర్నమెంట్..!

కేయూ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్(పురుషుల రెండో దశ) నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ టోర్నమెంట్ను వీసీ కె. ప్రతాప్ రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. హ్యాండ్ బాల్, సాఫ్ట్బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, క్రాస్ కంట్రీలో పోటీలు జరుగుతాయని, ఉమ్మడి WGL, KMM, ADB నుంచి రానున్నట్లు తెలిపారు.
News October 24, 2025
పెద్దపల్లి మీదుగా ప్రత్యేక రైల్వే సర్వీసులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-బరౌని మధ్య రెండు ప్రత్యేక వీక్లీ రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈనెల 25న చర్లపల్లి-బరౌని 07093 బరౌని ఎక్స్ప్రెస్, 27న బరౌని-చర్లపల్లి 07094ఎక్స్ప్రెస్ నడుస్తాయన్నారు. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయని, జనగామ, KZPT, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్లో రైళ్లు ఆగనున్నాయి.
News October 24, 2025
మెదక్: సర్పంచులు లేక మరుగునపడుతున్న గ్రామాలు!

మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు సర్పంచులు లేక పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. గ్రామంలో చిన్న సమస్యను చెప్పడానికి గ్రామానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే.. అయిన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తే కోర్టులు ఎన్నికలను నిలిపివేశాయి. గ్రామాల్లో నియమించిన స్పెషల్ ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


