News April 15, 2025

NTR: సీఎం పర్యటన ప్రాంతం పరిశీలన: సీపీ

image

ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ భవానిపురం బేరం పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. అదేవిధంగా బందోబస్తు ఏర్పాటులపై అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తెలిపారు.

Similar News

News April 22, 2025

జలుమూరు: నాడు IPS.. నేడు IAS

image

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ని పలువురు అభినందించారు.

News April 22, 2025

ప్రతి వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి:  ADB SP

image

ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారుల వాహనాల డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి వాహనంలో కెమెరాలు చేశామన్నారు. వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేశారు.

News April 22, 2025

NZB:  జిల్లా నూతన జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన G.V.N. భరతలక్ష్మిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పువ్వుల మొక్కను అందజేశారు. ఇరువురు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను నూతన జడ్జీకి సీపీ వివరించారు.

error: Content is protected !!