News December 18, 2025
NTR: అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. అమ్మానాన్నను కోల్పోయిన చిన్నారులు

వారం రోజుల కిందట <<18518983>>భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. వాంబేకాలనీకి చెందిన అజయ్ కుమార్‌కు గుండెపోటు రాగా, నాలుగో అంతస్తు నుంచి తీసుకురాలేమని 108 సిబ్బంది వెనుదిరిగారు. సకాలంలో వైద్యం అందక అజయ్ మృతి చెందగా, ఆ బాధతో భార్య నాగలక్ష్మి ప్రాణాలు విడిచింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టెక్నీషియన్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు.
Similar News
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయితీ వద్దు.. పల్లె ప్రగతే ముద్దు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1500 పైగా గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరగగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మద్దతుదారులు స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియడంతో గెలిచినవారు, ఓడినవారు రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని విస్మరించొద్దని ప్రజలు పేర్కొంటున్నారు. అందరూ కలిసి స్థానికంగా నెలకొన్న కుక్కలు, కోతుల బెడద తొలగించాలని.. రోడ్ల, మురుగు కాలువల వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 19, 2025
మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు భారత్

అబుదాబీలో భారీ వర్షం కారణంగా భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆసియా కప్ U-19 సెమీఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. కాసేపట్లో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్ చేరనుంది. మరో సెమీస్‌లో బంగ్లా, పాక్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది.
News December 19, 2025
పల్నాడు: నిరుపయోగంగా సంపద కేంద్రాలు

పల్నాడు జిల్లాలో పంచాయతీల ఆదాయం పెంచేందుకు టీడీపీ ప్రభుత్వంలో సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో వందలాది గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వీటిని వినియోగించడంలో అధికారులు పట్టనట్లుగా ఉండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం అధికమైంది. వీధుల్లో సేకరించిన చెత్త శివారు ప్రాంతాల్లో పడేస్తున్నారు.


