News October 18, 2025
NTR: అటెండర్ ఉద్యోగం.. విదేశీ టూర్లు.. ఎట్టా సామీ..? (2/2)

విజయవాడ పన్నుల శాఖ-2 అటెండర్ కొండపల్లి శ్రీనివాస్ అక్రమ సంపాదనతో ఏటా విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అటెండర్ స్థాయి వ్యక్తి వీసా, పాస్‌పోర్టు కలిగి ఉండటంపై అధికారులు నివ్వెరపోయారు. ఆఫీసు సమయం తర్వాత దర్జాగా వసూళ్లు చేసే శ్రీనివాస్‌కు పన్నుల శాఖలో హైలెవెల్ అధికారుల అండ ఉందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Similar News
News October 18, 2025
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.
News October 18, 2025
చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

కాస్త ఎత్తు తక్కువగా ఉండి, లావుగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా, అందంగా కనిపిస్తారంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీరకు చిన్న అంచు ఉన్నవి ఎంచుకోవాలి. దీనిపై మీడియం ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ వెయ్యాలి. డీప్‌నెక్ బ్లౌజ్ వేసుకోవాలి. పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. నెక్ విషయానికొస్తే హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.
News October 18, 2025
తిరుపతి హాథీరాంజీ మఠం పూర్తిగా శిథిలం.?

తిరుపతిలోని హాథీరాంజీ మఠంపై అధికారుల అధ్యయనం పూర్తి అయినట్లు సమాచారం. మఠంలోని చాలా భాగం పూర్తిగా శిథిలం అయినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థానిక నాయకులు హాథీరాంజీ వంశస్థులతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నారట. కూలగొట్టే పరిస్థితి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చి ప్రాచీన కట్టడాలు కాపాడుకొనేలా ప్రయత్నం చేయాలని బంజారా సంఘాలు కోరుతున్నట్లు సమాచారం.