News September 8, 2025

NTR: అధికారుల లెక్కల్లోనే సమస్యల పరిష్కారం

image

PGRSలో అధికారుల నివేదికలకు, ప్రజల సంతృప్తికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. జూన్ 1 నుంచి 10,239 సమస్యలు రాగా, 9,261 పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఐవీఆర్ఎస్ కాల్స్‌లో సగానికిపైగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సమస్యలను పట్టించుకోకపోవడం, దరఖాస్తులు సచివాలయాలకే పరిమితం కావడం ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

Similar News

News September 8, 2025

CM రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

TG: CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘BJP అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది’ అని గతేడాది మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై TG BJP వేసిన పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని CJI గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ పిటిషన్‌ను గతంలో HC కొట్టేయగా BJP నేత కాసం వెంకటేశ్వర్లు SCలో సవాల్ చేశారు.

News September 8, 2025

రేపటి లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: DIEO

image

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 8, 2025

ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు

image

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.