News October 23, 2025

NTR: అరుణాచలం వెళ్తున్నారా.. ఇది మీకోసమే

image

కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నవంబర్ 3న విజయవాడ నుంచి రూ.2,500 ఛార్జీతో ప్రత్యేక బస్సు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రిప్‌లో శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా కల్పిస్తారు. https://www.apsrtconline.in/ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.

Similar News

News October 23, 2025

కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

image

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.

News October 23, 2025

ఇంజనీర్ టూ రౌడీ షీటర్..

image

ఇంజనీరింగ్ చదువుకున్న చింటూ మరైన్ ఇంజనీరింగ్‌గా పనిచేశారు. అనంతరం మేనమామ కటారి మోహన్‌కు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారు. చిత్తూరును అప్పట్లో శాసిస్తున్న సీకే బాబుకు దీటుగా చింటూ అంచెలంచెలుగా ఎదిగారు. 2007 డిసెంబర్ 31న సీకే బాబుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్, అనంతరం గన్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రస్తుత కేసులో అనేక షరత్తులతో బెయిల్‌పై ఉన్నారు.

News October 23, 2025

జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

image

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.