News October 31, 2025
NTR: అలర్ట్.. రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో ఆగస్ట్ 2025లో నిర్వహించిన బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News October 31, 2025
MHBD: 22 ప్రాథమిక పాఠశాల్లో నూతనంగా ప్రీ ప్రైమరీ తరగతులు

MHBD జిల్లాలోని నూతనంగా 22 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రైమరీ విభాగానికి రెండు పోస్టులను DEO దక్షిణామూర్తి మంజూరు చేశారు. ప్రతి పాఠశాలకు ఒక పూర్వ ప్రాథమిక బోధకులు, ప్రతి పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలన్నారు. ఆయా పోస్టులకు కనీస విద్యార్హత 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని, దరఖాస్తులను నవంబర్ 7 వరకు MEOలకు అందించాలన్నారు.
News October 31, 2025
GNT: పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణాధికారి శివప్రసాదరావు శుక్రవారం తెలిపారు. 1,3 సెమిస్టర్ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.
News October 31, 2025
కొట్టుకుపోయిన డీసీఎం లభ్యం.. డ్రైవర్ కోసం గాలింపు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలోని నిమ్మ వాగు వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభించింది. వరద నీరు తగ్గిపోవడంతో వాగులో డీసీఎం వ్యాన్ బయటపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్రేన్ల ద్వారా ఆ వ్యాన్‌ను బయటకు తీశారు. అయితే, డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.


