News April 12, 2025

NTR: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో గంపలగూడెంలోని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని అపరంజి ఉత్తమ మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కి 452 మార్కులతో గంపలగూడెం మండలంలోని ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానంలో నిలిచింది. అపరంజి ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. 

Similar News

News April 19, 2025

బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్య

image

బంగ్లాలో హిందువులపై దాడి కొనసాగుతోంది. దీనాజ్‌పూర్‌ జిల్లాలో భాబేశ్ చంద్ర అనే హిందూ నేతను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషద్ సంస్థకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్స్‌పై వచ్చి ఆయన్ను కిడ్నాప్ చేశారని, మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు పారేశారని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News April 19, 2025

సంగారెడ్డి: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాలని చెప్పారు. మరొకరి మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు.

News April 19, 2025

MBNR: నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోకముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. రైతు నష్టపోకుండా విత్తన సంస్థలు,డీలర్లు,నాణ్యమైన లేబుళ్లు ప్యాకింగ్ ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.

error: Content is protected !!