News July 5, 2025
NTR: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్విరాన్‌మెంట్ స్పెషలిస్ట్ (2), ఎన్విరాన్‌మెంటలిస్ట్ (1), ప్రాజెక్టు ఇంజినీర్-సస్టైనబిలిటీ(1) పోస్టులను ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 18లోపు https://crda.ap.gov.in/లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.
Similar News
News July 5, 2025
రాజకీయాలు కాదు రైతుల శ్రేయస్సు ముఖ్యం: మంత్రి తుమ్మల

యూరియా విషయంలో ఎలాంటి రాజకీయం లేదని, రైతుల శ్రేయస్సే ముఖ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజకీయాలు వద్దని.. రాష్ట్రానికి వాటాగా రావాల్సిన 1.94 లక్షల టన్నుల యూరియాను తెప్పించేలా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసమే యూరియా అడిగిందని, గత యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.
News July 5, 2025
KMR: పోలీసులంటే పవర్ కాదు.. పారిశుధ్యం కూడా!

కామారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛ పోలీస్ స్టేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఎస్పీ రాజేశ్‌చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ఆవరణలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొన్నారు. ఎస్పీ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
News July 5, 2025
కరీంనగర్: మళ్లీ సెప్టెంబర్‌లోనే దుకాణాలు ఓపెన్!

రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల సన్న బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 10,10,532 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 9,34,307 మంది లబ్ధిదారులు మాత్రమే బియ్యం తీసుకున్నారు. ఇంకా 76,225 మంది రేషన్ తీసుకోలేదు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం గతనెల 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. కాగా, రేషన్ దుకాణాలు తిరగి SEPTలో తెరుచుకోనున్నాయి. మీరు బియ్యం తీసుకున్నారా? COMMENT.