News September 13, 2025
NTR: ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్.. అప్లై చేసుకోండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేంద్రం అందించే NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోపు https://portal.bseap.org/APNMMSTFV/Account/Login.aspxలో దరఖాస్తు చేసుకోవచ్చు. 180 మార్కులకు పరీక్ష నిర్వహించి..అందులో ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం అందిస్తుందని NTR జిల్లా DEO యూవీ సుబ్బారావు తెలిపారు.
Similar News
News September 13, 2025
జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 13, 2025
నిండుకుండల శ్రీరామ్ సాగర్

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. శనివారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.501 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి భారీగా 1,08,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 23 గేట్లు ఎత్తి 91,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఐఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.
News September 13, 2025
సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.