News August 23, 2025
NTR: గణేశ్ ఉత్సవాలకు మండపం పెడుతున్నారా.. ఇది మీ కోసమే

ఎన్టీఆర్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసేవారు సింగిల్ విండో ద్వారా సులభంగా అనుమతి పొందవచ్చని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. https://ganeshutsav.net/ వెబ్‌సైట్‌లో మండపం నిర్వహించేవారు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాల అనంతరం నిమజ్జనం తేదీ, వాహన వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని సీపీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News August 23, 2025
పెద్దపల్లి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సదానందం

CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తాండ్ర సదానందం నియమితులయ్యారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలో జరిగిన CPI 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సదానందంను ఎన్నుకున్నారు. తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వానికి సదానందం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో CPIని, ప్రజా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
News August 23, 2025
జగిత్యాల: డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గణేష్ మండపాల వద్ద శోభాయాత్రలో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దాలు చేసి సౌండ్ సిస్టంలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డీజే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలనీ అధికారుల్ని ఆదేశించారు.
News August 23, 2025
జగిత్యాల: గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని పోలీస్ అధికారులను సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు.