News March 25, 2025
NTR: జిల్లాకు ఆరంజ్ అలర్ట్- APSDMA

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) మంగళవారం హెచ్చరించింది. వడగాడ్పులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 41.5, జి.కొండూరు 41.3, ఇబ్రహీంపట్నం 42.2, కంచికచర్ల 41.4, విజయవాడ రూరల్ 40.5, విజయవాడ అర్బన్ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవనున్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రోడ్లు, కాలువలు, హాస్పిటల్, ఇళ్లు, పర్యావరణ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
News October 24, 2025
చిచ్చర పిడుగు.. 17 ఏళ్లకే ప్రపంచ మేధావిగా గుర్తింపు

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి కరెక్ట్‌గా సూటవుతుంది ఈ కుర్రాడికి. 4 ఏళ్ల వయసులో కంప్యూటర్‌పై పట్టు సాధించి 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్, 17 ఏళ్లకి Ai ఇంజినీర్‌గా రాణిస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అతడే ఆసియాలోనే యంగెస్ట్ డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్ద్ శ్రీ వాత్సవ. తెనాలి ఐతానగర్‌కు చెందిన ప్రియమానస, రాజకుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్ద్ నేడు టోరీ రేడియో లైవ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు.
News October 24, 2025
వికారాబాద్: పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించాలి: సీపీఎం

పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను సీపీఎం ఆధ్వర్యంలో కలిసి పత్తి రైతులకు క్వింటాలుకు రూ.5 వేల బోనస్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. డిమాండ్‌ను ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ వారికి తెలియజేశారు.


