News December 26, 2025
NTR జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్డు ధర..!

కోడిగుడ్డు ధర కొండెక్కిందని ప్రజలు అంటున్నారు. చందర్లపాడు తదితర మండలాలలో నేడు గుడ్డు ధర ఒక్కటి రూ.7.55కు చేరిందని స్థానికులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో భాగమైన గుడ్లు ధరలు పెరగడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. మేత ధరలు, రవాణా వ్యయాలు పెరగడమే గుడ్డు ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. మరి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంతో కామెంట్ చేయండి..!
Similar News
News December 29, 2025
మడకశిర MLA ఇంట్లో సినీ హీరోల సందడి

అనంతపురంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నివాసానికి ప్రముఖ సినీ హీరో సాయికుమార్, తనయుడు హీరో ఆది, ‘శంబాల’ చిత్రం హీరోయిన్ అర్చన, చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం వెళ్లారు. వారికి ఎంఎస్ రాజు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సాయి కుమార్‌కు, అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. సినిమాకు సంబంధించిన పలు విషయాలను ఎమ్మెల్యే వారిని అడిగి తెలుసుకున్నారు.
News December 29, 2025
చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి?

శివాలయాల్లో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి ఎడమ వైపుగా అభిషేక జలం బయటకు వచ్చే ‘సోమసూత్రం’ వరకు వెళ్లాలి. ఆ నీటిని దాటకుండా, తిరిగి వెనక్కి వస్తూ ధ్వజస్తంభాన్ని చేరుకోవాలి. ఆపై కుడి వైపుగా సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి. ఇలా ఓసారి పూర్తి చేస్తే ఓ చండీ ప్రదక్షిణ అవుతుంది. సోమ సూత్రం దాటకుండా చేసే ఈ ప్రదక్షిణ అతి శక్తిమంతమైనది.
News December 29, 2025
ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.


