News February 5, 2026

NTR జిల్లాలో 21 బార్ల కేటాయింపు

image

ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో లాటరీ విధానంలో బార్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరిగిందని NTR జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలనలో జరిగిన ఈ ప్రక్రియలో గతంలో మిగిలిన బార్లకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు వెల్లడించారు.

Similar News

News February 21, 2026

వసూల్ రాజా.. సుంకాలతో USకు భారీగా ఆదాయం

image

అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు, ఫీజుల ద్వారా 2025లో USకు ఏకంగా రూ.26 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2024తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. అయితే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అంతిమంగా ఆ దేశ ప్రజలపైనే పడుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్స్ విధించడం వల్ల స్థానికంగా వాటి ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతోంది.

News February 21, 2026

హిందూపురం.. ఇక బాలయ్య స్థావరం!

image

హిందూపురంలో MLA నందమూరి బాలకృష్ణ సొంతింటి నిర్మాణం చేపట్టారు. పదేళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న ‘స్థానికత’ విమర్శలకు చెక్ పెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వనం కాలనీలో నివాసంతోపాటు కార్యకర్తల కోసం కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ గెలుపు సాధించిన బాలయ్య ఇకపై తాను నియోజకవర్గంలోనే శాశ్వతంగా ఉంటాననే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకు ఈ నిర్మాణం తలపెట్టినట్లు తెలుస్తోంది.

News February 21, 2026

ఏఐ మాయ.. ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

image

ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ జాబ్స్ పోతాయనే ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధికి కోత పడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లలో 30 కోట్ల జాబ్స్ పోతాయని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. కానీ ఆ సంఖ్య 80 కోట్లకు పైనే అని కన్సల్టింగ్ సర్వీసుల కంపెనీ మెక్‌కిస్నీ చెప్పింది.