News November 25, 2025

NTR: జోగి రమేష్‌కి రిమాండ్ పొడిగింపు

image

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News November 25, 2025

ప్రశాంతతను ప్రసాదించే విష్ణు నామం..

image

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
అమృతాన్ని ఇచ్చే చంద్రుడి నుంచి ఉద్భవించిన, దేవకీ నందనుడు అయిన కృష్ణుడి శక్తి కలిగిన, త్రిసామ అనే వేదాల సారం కలగలసిన పవిత్ర శ్లోకమిది. విష్ణు సహస్ర నామాల్లో ఒకటైన ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్మకం. మనకు తెలియకుండానే అంతర్గత శక్తి పెరిగి మనశ్శాంతి దొరుకుతుందని చెబుతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 25, 2025

ఏంటయ్యా రాహుల్.. ఏంటీ ఆట!

image

వెరీ టాలెంటెడ్ బ్యాటర్ అని పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టెస్టుల్లో దారుణంగా విఫలం అవుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులోనూ కీలక సమయంలో చేతులెత్తేశారు. 2 ఇన్నింగ్సుల్లో కలిపి 28 రన్సే చేశారు. దీంతో టెస్టుల్లో అతడి యావరేజ్ 35.86కి పడిపోయింది. కీలక సమయాల్లో జట్టును ఆదుకోనప్పుడు ఎంత టాలెంట్ ఉండి ఏం లాభమని నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిని పక్కనబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 25, 2025

గ్రేటర్ విశాఖ రెవెన్యూలో అవినీతిమయం

image

GVMC పరిధిలోని అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసుకున్న అనంతరం ఇంటిపన్నుల మదింపులో రెవెన్యూ సిబ్బంది భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపార్ట్మెంట్‌‌లో ఫ్లాట్లకు పన్నులు తగ్గించడానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్న ఏరియాల్లో మరింత ఎక్కువగా ఉంటోందట. వాణిజ్య సముదాయాల విషయంలో విస్తీర్ణాన్ని బట్టి రేట్లు మారుతున్నాయని టాక్.