News December 31, 2025

NTR: ‘డిజిటల్ అరెస్ట్’.. సాంకేతికతతో పటిష్ఠ నిఘా

image

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘డిజిటల్ అరెస్ట్’ సహా సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతతో పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. సైబర్ సురక్ష-కస్టమర్ సైబర్ సేఫ్టీ వెరిఫికేషన్ సిస్టమ్‌లో భాగంగా Police Analytics Dashboard ద్వారా ఫిర్యాదులు, నమోదులను రియల్‌టైమ్‌లో విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవస్థ అమలుతో ప్రజల నుంచి వచ్చే సమాచారం వేగంగా నమోదు కావడంతో మోసాలపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోంది.

Similar News

News February 10, 2026

పోలవరం: చుక్కల్లో వేరుసెనగ ధర.. సామాన్యుడి బేజారు

image

వేరుసెనగ ధర సామాన్యులకు భారంగా మారింది. పోలవరం జిల్లాలోని రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు ప్రాంతాల్లో మంగళవారం కిలో ధర రూ.180 నుంచి రూ. 200లకు చేరింది. గత నెలలో రూ.120 ఉండగా, దిగుబడి తగ్గడంతో ఒక్కసారిగా రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజమండ్రి, ఏలేశ్వరం నుంచి దిగుమతులు తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

News February 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,950
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,674
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 10, 2026

HYD: 1,926 సమస్యాత్మక ప్రాంతాలు: DGP

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. 1,926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామని, 167 సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.