News January 5, 2026
NTR: డీ-మార్ట్‌కి భార్యాభర్తలు.. భార్య అదృశ్యం

భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉండవల్లికి చెందిన భార్యాభర్తలు ఆదివారం విజయవాడ డీ-మార్ట్‌లో షాపింగ్‌కి వచ్చారు. భర్త షాపింగ్ చేస్తుండగా భార్య ఫోన్ మాట్లాడుతూ ఉంది. కాసేపటికి భార్య కిందకి వెళ్లి భర్తను రమ్మని ఫోన్ చేసింది. అయితే కిందకి వచ్చిన భర్తకి భార్య కనపడలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో భర్త సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 7, 2026
ఫిబ్రవరి 07: చరిత్రలో ఈరోజు

* 1888: రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం * 1969: సమరయోధుడు ఆమంచర్ల గోపాలరావు మరణం * 1937: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిహు రూట్ మరణం * 1990: కేంద్ర మాజీ మంత్రి మల్లు అనంత రాములు మరణం * 2008: హాస్యనటుడు లక్ష్మీపతి మరణం * 2018: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం (ఫొటోలో)
News February 7, 2026
బాపట్ల: ‘ఆ ఆదేశాలు చెల్లుబాటు కావు’

బాపట్ల జిల్లాలో అనుమతి లేకుండా జారీ చేసిన డిప్యూటేషన్ ఆదేశాలు చెల్లుబాటుకావని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్వర్ణ అవార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగుల డిప్యూటేషన్లపై సమగ్రంగా ఆరా తీశారు. వివిధ శాఖల్లో అనుమతితో లేదా అనుమతి లేకుండా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఆర్డర్ కాపీలు సేకరించాలని ఆదేశించారు.
News February 7, 2026
సంగారెడ్డి: ఎన్నికల ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల అభ్యంతరాలు, సమాచారం కోసం 81253 52721 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని, వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికలకు ఓటర్లు, అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.


