News March 27, 2025
NTR: తల్లిదండ్రులను హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

NTR (D) గంపలగూడెంలో తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో కుమారుడికి రూ.వెయ్యి జరిమానా, జీవిత ఖైదు విధించింది. స్థానిక ఎస్సై ఎస్ శ్రీనివాస్ వివరాల మేరకు.. మండలంలోని చింతల నర్వ శివారు చెన్నవరానికి చెందిన నిందితుడు మరీదు వెంకటేశ్వర్లు తన తండ్రిని 2006లో తల్లిని , 2023లో హత్య చేశాడు. ఈ క్రమంలో తిరువూరు కోర్టులో జరిగిన విచారణలో నేరం రుజువు కావడంతో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జడ్జి నాగ శైలజ తీర్పు ఇచ్చారు.
Similar News
News November 5, 2025
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్‌ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్‌ఛైర్‌లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.
News November 5, 2025
HYD: రేవంత్ రెడ్డికి KTR కౌంటర్

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ రోడ్ షోలో సీఎం వ్యాఖ్యలకు KTR స్పందించారు. ‘భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 25-28 ద్వారా మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. దీనికి అంబేడ్కర్ కృషి చేశారు. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా పాటించడానికి, ప్రచారం చేయడానికి ఈ హక్కు అనుమతిస్తుంది. రాజకీయ చర్చలతో లౌకిక రాజ్యమైన భారత్ గొప్పతనాన్ని అపహాస్యం చేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
News November 5, 2025
వేతనం వేములవాడలో.. విధులు యాదగిరిగుట్టలో..!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తూ వేములవాడ రాజన్న ఆలయం నుంచి వేతనం పొందుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. చాలాకాలం పాటు వేములవాడలో పనిచేసి యాదగిరిగుట్టకు బదిలీపై వెళ్లిన ఓ అధికారి వేతనాన్ని వేములవాడ నుంచి చెల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికారి వేతనం యాదగిరిగుట్ట నుంచి చెల్లించాలని, లేదంటే వేములవాడలో పనిచేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.


