News April 2, 2026
NTR: తల్లీబిడ్డను కాపాడారు..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో సుఖప్రసవం చేశారు. పెనుగంచిప్రోలుకి చెందిన రాజేశ్వరి(25)కి పురిటినొప్పులు రావడంతో తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్గయ్యపేటకు తరలించారు. మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమవ్వడంతో వాహనంలోనే సిబ్బంది డెలివరీ చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 14, 2026
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు!

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సోమవారం ఎండలు మండిపోయాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ఠ, 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 42, గుంటూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెనాలిలో 38 డిగ్రీలు నమోదు కాగా, బాపట్ల, చీరాలలో 36 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News April 14, 2026
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్.. లక్షణాలు ఇవే

కొందరు మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు తయారవుతుంటాయి. దీని వల్ల నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడిపడి తరచూ మూత్రవిసర్జన, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరగడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
News April 14, 2026
NLG: డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని NLGలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


