News January 7, 2026
NTR: దారుణం.. బాలికపై యువకుడి అత్యాచారం.!

చందర్లపాడు మండలంలోని ఓ గ్రామంలో 14ఏళ్ల బాలికపై ప్రేమ పేరుతో జాషువా (21) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామానికి వచ్చిన బాలికను, ఇంట్లో ఎవరూ లేని సమయంలో జాషువా లొంగదీసుకుని, ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ ధర్మరాజు తెలిపారు.
Similar News
News February 22, 2026
నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించారు.
News February 22, 2026
WGL: నేడు గురుకుల ప్రవేశ పరీక్షలు

ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీసీఓ అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో 3,933 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు హాల్ టికెట్లతో ఉదయం 10 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News February 22, 2026
తూ.గో: పసిపాపపై వృద్ధుడి అత్యాచార యత్నం

దేవరపల్లి మండలంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. పొగాకు బ్యారల్ క్యూరింగ్ పనుల కోసం వచ్చిన నేకూరి ఎలీషా (70) ఈ దారుణానికి యత్నించగా స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై గతంలోనూ పోక్సో కేసు ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


