News September 15, 2025

NTR: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు..త్వరపడండి

image

ఎన్టీఆర్ వైద్యసేవలో 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి(టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APMC రిజిస్ట్రేషన్ కలిగి MBBS పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని, https://apmsrb.ap.gov.in/msrb/లో ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V.సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్‌సైట్ చూడాలన్నారు.

Similar News

News September 15, 2025

పలు కాలేజీలు బంద్.. ఎగ్జామ్స్‌కు మినహాయింపు!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పరీక్షలకు ఈ బంద్ మినహాయింపు ఉంటుందని తెలిపాయి. అయితే మరికొన్ని కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చల తర్వాత బంద్‌పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

News September 15, 2025

అందాల రాణి.. ఆర్మీ ఆఫీసర్‌గా..

image

పుణే (MH)కు చెందిన కాశీష్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. మోడలింగ్, యాక్టింగ్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్‌లో PhD ఛాన్స్ వచ్చింది. కానీ వీటిని లెక్క చేయకుండా దేశం కోసం ఆర్మీలో చేరాలనుకున్నారు. 2024లో CDS ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD)లో పని చేస్తున్నారు.

News September 15, 2025

నిర్మల్ జిల్లాలో మోస్తరు వర్షాలు

image

గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దిలావర్పూర్ మండలంలో అత్యధికంగా 23.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మామడలో 17.8, కుంటాల 7.6, నిర్మల్‌ 5.4, తానూర్, సోన్ మండలాల్లో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 4.0 మిల్లీమీటర్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.